ఆళ్లగడ్డ: భక్తులకు దేవస్థానం హెచ్చరిక

5చూసినవారు
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం పేరుతో ‘యాజమాన్’, ‘శ్రీమందిర్’ వంటి అనధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు సేవల బుకింగ్ పేరుతో భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆలయ అధికారులు హెచ్చరించారు. భక్తులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, అధికారిక సేవలు కేవలం ఆలయ కౌంటర్ల ద్వారానే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మోసపూరిత ప్లాట్‌ఫారమ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్