అహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాలు గత నెల 21న ప్రారంభమయ్యాయని, ఈ రాత్రి దిగువ అహోబిలంలో స్వామివారు అశ్వవాహనంలో దర్శనమిస్తారని మఠం సీఈవో వి. ఎల్. ఎన్. రామానుజన్ తెలిపారు. మంగళవారం ఉదయం 8:30 గంటలకు రథోత్సవం, ఎగువ అహోబిలంలో గరుడోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.