ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీశ్ బాబు, సోషల్ మీడియాలో ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్ ఆర్యవైశ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆళ్లగడ్డలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి సేవ చేసిన ప్రముఖ నాయకుడు టీజీ వెంకటేశ్‌పై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.