రుద్రవరంలో ఈనెల 10వ తేదీ ఆదివారం దీనీ ఇజిమా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముస్లిం పెద్దలు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో మత గురువులు ఖురాన్ సందేశాలను వినిపిస్తూ ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి దైవ మార్గంలో నడిపించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.