ఉయ్యాలవాడలోని మాయలూరులో శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి
క్రికెట్ పోటీలు అత్యంత రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు శ్రీ లోకేష్ శర్మ గారి పూజలతో మొదలైన ఈ టోర్నమెంట్ లో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మహేశ్వర రెడ్డి, మాధవ రెడ్డి, నాగేంద్ర ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, నందీశ్వర రెడ్డి, షేక్షావలి రెడ్డి, కిషోర్ రెడ్డి, కి. సుధాకర్ రెడ్డి ల పర్యవేక్షణలో ఈ పోటీలు కొనసాగుతున్నాయని శివ ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడా సంబరం క్రీడాకారుల్లో సరికొత్త జోష్ నింపుతోంది.