నూతన సంవత్సర వేడుకల్లో జనసేన నాయకులు, కార్యకర్తల సందడి

11చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, నాయకులకు గజమాలతో సత్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :