నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామ సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనం - ఆటో ఢీకొన్న ఘటనలో విద్యుత్ శాఖ లైన్మెన్ ప్రసాద్ (45) మృతి చెందారు. ఈ ప్రమాదంలో లైన్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తీవ్రంగా గాయపడ్డారు. విధుల్లో భాగంగా స్థానిక విద్యుత్ ఉప కేంద్రం నుంచి రాంపల్లికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన లైన్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్యను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.