కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై శిరివెళ్ల మెట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.