ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మహానాడు 2026 రెండో రోజు వేడుకలు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల ఉత్సాహం రాబోయే విజయాలకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంలో కార్యకర్తలు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు.