ఆళ్లగడ్డ మండలంలోని చింతకుంట, ఓబులంపల్లె, పడకండ్ల, నాగిరెడ్డిపల్లె, పాలసాగరం, ఎస్. లింగందిన్నె గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈ చిరుజల్లులతో వాతావరణం చల్లబడి, తీవ్ర వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది.