శనివారం ఉయ్యాలవాడ మండలంలో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా ఉన్న ఉక్కపోతతో ప్రజలకు ఉపశమనం లభించింది. ఎండ తీవ్రతతో బయటకు రాలేకపోయిన ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. అయితే, కల్లాల్లో ఆరబెట్టిన మిరప దిగుబడులు తడవకుండా కాపాడేందుకు రైతులు పరుగులు తీసి పట్టలు కప్పారు.