ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా సాహస క్రీడలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువకులు ఇసుక సంచి, గుండు, చంద ఎత్తే క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్యాపిలి చందు, వెల్దుర్తి సుధాకర్, రఫీలు విజేతలుగా నిలిచి ఒక్కొక్కరు రూ. 5,000 చొప్పున బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన క్రీడలు కళ్యాణోత్సవాలకు మరింత శోభను తెచ్చాయి.