జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. రూరల్ సీఐ రమణ మాట్లాడుతూ, డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. అనేక కుటుంబాల జీవితాలు డ్రైవింగ్‌పై ఆధారపడి ఉంటాయని తెలిపారు.