శిరివెళ్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ యుగంధర్ బాబు, ఆళ్లగడ్డ అదనపు ఎస్పీ ప్రమోద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘటనలపై వస్తున్న వదంతులు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, విధి నిర్వహణలో ఆటంకాలు కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.