అహోబిలంలో స్వాతి నక్షత్ర ఉత్సవం

2792చూసినవారు
బుధవారం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కాలినడకన నల్లమలలోని నవ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. దిగువ అహోబిలంలో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో సుదర్శన హోమం నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్