నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పాల్గొన్నారు. తెలుగు గంగ, KC కెనాల్ ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకు ఏప్రిల్ 15 వరకు నిరంతరాయంగా నీరందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో రైతులు పడిన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ఇకపై చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఆమె భరోసా ఇచ్చారు.