దొర్నిపాడు మండలంలో "హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్" సంస్థ ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం తెలిపారు. నంద్యాల కలెక్టరేట్‌లో బాధితులతో కలెక్టర్, ఎస్పీ సునీల్ షెరాన్ సంయుక్తంగా సమావేశమై, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మోసంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.