
దొర్నిపాడులో 16 నుంచి ఒంటి పూట బడులు
దొర్నిపాడు మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని ఎంఈవో మనోహర్ రెడ్డి గురువారం తెలిపారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో దొర్నిపాడు జడ్పీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.




































