
ఆలూరు: రేపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ
వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆలూరు మండల కేంద్రంలో బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మంగళవారం తెలిపారు. ఆలూరు అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, వినతిపత్రం సమర్పిస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.





































