కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కుందనగుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన లారీ గొర్రెల మందపైకి దూసుకుపోవడంతో 60 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని తెలిపారు. బాధితులు ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.