ఆస్పరిలో స్థానిక సంత మార్కెట్ పక్కన ఉన్న మినీ నీటి ట్యాంకు వద్ద ఒక వానరం ఎండ తీవ్రతకు దాహంతో అల్లాడుతూ, స్వయంగా కుళాయిని వదులుకుని నీళ్లు తాగింది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కొందరు దీన్ని ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.