ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హోళగుంద మండలం ఎల్లర్తి గ్రామంలో బుధవారం ఘనంగా జరిగాయి. సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనాథలకు బ్రెడ్ పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే విరూపాక్షి నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి, అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఎస్.కె. గిరి కొనియాడారు.