కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సోమవారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను అందజేశారు. కర్నూలు, ఆలూరు, రాతన గ్రామాలలోని ఆశ్రమ పాఠశాలలకు చెందిన 64 మంది విద్యార్థులకు ఈ మెటీరియల్ ను అందించారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.