కర్నూలు జిల్లా హాలహర్వి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో మహిళ జయలక్ష్మిపై దాడి చేసిన మంగళి రంగన్న, భార్య మంగళి ఈరమ్మలకు కర్నూలు ఏడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయాధికారి లక్ష్మిరాజ్యం గురువారం తీర్పు చెప్పారు. నేరం నిరూపణ కావడంతో ఇద్దరికీ ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 15,000 జరిమానా విధించారు. కేసు ప్రాసిక్యూషన్ తరపున ఇన్చార్జి పీపీ సరళాదేవి వాదించారు.