ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈనెల 26న సాయంత్రం బర్రె తగిలి కిందపడడంతో తీవ్రంగా గాయపడిన ఓబులేష్ గౌడ్ (50) అనే రైతు చికిత్స పొందుతూ మృతి చెందారు. మొదట దేవనకొండ పీహెచ్సీకి, అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు.