ఆస్పరి మండలంలోని బిల్లేకల్లు గ్రామంలో జరిగిన దాడి ఘటనలో 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొండ పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆస్పరి సీఐ శ్రీనివాస నాయక్ తెలిపారు. ఈనెల 20న చింతమాను వర్గీయులు మరో వర్గానికి చెందిన ఈరమ్మ, సోమశేఖర్‌పై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేసినట్లు కేసు నమోదైంది. ఆస్పరి సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఐదు కొడవళ్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించి ఆదోని ఉపకారాగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.