ఆలూరు పట్టణంలోని మారుతినగర్ లో గురువారం మాజీ సైనికుడు బసవరాజు ఇంట్లో చోరీ యత్నం జరిగింది. బసవరాజు భార్య మార్కెట్ వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా, ఇంట్లో ఎంత వెతికిన ఆభరణాలు, నగదు దొరకకపోవడంతో దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన బసవరాజు భార్య ఇంటి తలుపు తెరచి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.