ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం ఛత్రగుడి సమీపంలో శనివారం జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. ఆదోని వైపు వెళ్తున్న లారీ, బళ్లారి వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఒక డ్రైవర్‌కు కాలుకు తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘటనపై విచారణ జరుగుతోంది.