కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం చిప్పగిరి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం సున్నా ఉండాలని, పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. హెడ్ మాస్టర్ ను అడిగి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు.