ఉల్లి ధరల్లేక రైతు ట్రాక్టర్ తో పంట దున్నేశాడు

1చూసినవారు
మార్కెట్లో ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, ఆలూరు నియోజకవర్గంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు బేగారి మల్లికార్జున ఆదివారం తన రెండెకరాల ఉల్లి పంటను ట్రాక్టర్ తో దున్నేశారు. సుమారు రూ. 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినా, కొనుగోలుదారులు లేకపోవడంతో, క్వింటాకు రూ. 600 కంటే ఎక్కువ ధర పలకడం లేదని, పంట కోసి, గ్రేడింగ్ చేసి మార్కెట్ కు తరలించడానికి మరో లక్ష ఖర్చవుతుందని, కూలీల ఖర్చులు కూడా రావని ఆయన వాపోయారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విదేశీ ఎగుమతులను ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్