గూళ్యంలో అగ్నిప్రమాదం – లక్షల్లో ఆస్తి నష్టం

2చూసినవారు
గూళ్యంలో అగ్నిప్రమాదం – లక్షల్లో ఆస్తి నష్టం
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించి, మల్లి, గాదిలింగలకు చెందిన గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గుడిసెల్లో నిల్వ ఉన్న ధాన్యం, నగదు, బట్టలు కాలిబూడిదయ్యాయి. చిదానంద, లింగప్పలకు చెందిన నాలుగు గడ్డివాములు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఆలూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you