గుడిమిరాళ్ల: పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

10చూసినవారు
గుడిమిరాళ్ల: పిడుగు పడి గొర్రెల కాపరి మృతి
దేవనకొండ మండలం గుడిమిరాళ్ల గ్రామంలో బుధవారం రాత్రి పిడుగు పడి గొల్ల పక్కీరప్ప పెద్ద కుమారుడు రాముడు (57) మృతి చెందాడు. గొర్రెల మంద వద్ద ఉన్న రాముడిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనను ఎవరూ గమనించలేదు. గురువారం ఉదయం తోటి గొర్రెల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులను కలిగి ఉన్న రాముడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్