కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ప్రభుత్వ వైద్యశాలల్లో జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు పాటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల నిర్మాణాలు, మరమ్మత్తులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రమాణాలు సాధిస్తే కేంద్ర నిధులు లభిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.