ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కర్నూలు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సృజనాత్మక పోటీలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూన్ 5న జరిగే ఈ పోటీలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల
విద్యార్థులు పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.