ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని జిల్లా అధికారులు సూచించారు. బుధవారం కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పెన్షన్ల పంపిణీ, పీపీపీ, ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్, లబ్ధిదారుల మొబైల్ నంబర్ల సవరణ, ఖర్చు చేయని పెన్షన్ మొత్తాల రిమిటెన్స్ అంశాలపై చర్చించారు. ముఖ్య నిర్వహణాధికారి జి. వి. రమణారెడ్డి, డీఆర్డీఏ పథక సంచాలకుడు రమణారెడ్డి ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. తక్కువ పనితీరు కనబరిచిన మండలాలు, సచివాలయాలపై దృష్టి సారించి, తప్పు మొబైల్ నంబర్లను వెంటనే సవరించాలని సూచించారు.