కర్నూలు జిల్లాలోని దేవనకొండలో ఆదివారం చిరుజల్లులు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనితో చలి తీవ్రత పెరిగి, గ్రామస్థులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి వెనుకాడుతున్నారు.