ఆలూరు మండలం హులేబీడు గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాహనం ఢీకొట్టడంతో తుంబలబీడు గ్రామానికి చెందిన దేవేంద్రప్ప (36) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, తల్లి గోవిందమ్మను బస్సులో ఎక్కించిన తర్వాత రోడ్డు పక్కన తుంబలబీడుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.