నగరూరు: ఆటోను ఢీకొట్టిన వాహనం.. ఐదుగురికి గాయాలు

5చూసినవారు
నగరూరు: ఆటోను ఢీకొట్టిన వాహనం.. ఐదుగురికి గాయాలు
ఆస్పరి మండలంలోని నగరూరు బస్‌స్టాప్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఆదోని నుంచి వస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్