హాలహర్వి మండలంలోని నిట్రవట్టి గ్రామ సమీపంలో బుధవారం రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గంగాధర్, సుభాన్ అనే యువకులు ప్రయాణిస్తున్న బైకులు రోడ్డుపై గుంతలను తప్పించబోయే క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గంగాధర్‌కు స్వల్ప గాయాలు కాగా, సుభాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సుభాన్‌ను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారి ఆసుపత్రికి రిఫర్ చేశారు.