ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై అడ్డుగోలు: వైసిపి నాయకుల ఫిర్యాదు

0చూసినవారు
ఆస్పరి మండలం బిల్లేకల్లో గ్రామంలో సర్వేనెంబర్ 112 లో ఎస్సీలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మారెమ్మ, ఎల్లమ్మ గుళ్ల నిర్మాణ పనులను ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి వెంకటేష్ అడ్డుకుంటున్నారని, సొంత ఇంటి నిర్మాణంలో దౌర్జన్యం చేస్తున్నారని వైసిపి ఎస్సీ సెల్ మండల నాయకులు వసంతరాయుడు ఆరోపించారు. ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టర్ కు పిజిఆర్ఎస్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్ పనులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పరి ఎమ్మార్వో రామేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలోని దళితులు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :