ఆదోని జిల్లా కోసం ఆదిమానవుడి వేషంలో నిరసన

4చూసినవారు
ఆదోని జిల్లా కోసం ఆదిమానవుడి వేషంలో నిరసన
ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు గురువారం ఆదిమానవుడి వేషధారణలో ఆలూరు బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఆలూరు ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఆదోని జిల్లా ఏర్పాటు తప్పనిసరని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షను ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వినిపించాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :