ఆలూరు మండలంలోని మారెమ్మగుడి సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఈడిగ మునెప్ప అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.