ఆలూరులో టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీరోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు, ఇతర సామాజిక సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రతి సమస్యను స్వయంగా పరిశీలించి, తగిన పరిష్కారం తీసుకుంటామని, ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని వైకుంఠం జ్యోతి హామీ ఇచ్చారు.