హాలహర్వి మండలం గూళ్యంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలో నివసిస్తున్న మహేష్ (38) నీలావతి (34) అనే వివాహితతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం, వీరిద్దరూ మూడు నెలల చిన్నారితో కలిసి గూళ్యం గ్రామ సమీపంలోని పంట పొలాలకు వచ్చి, ముందుగా చిన్నారికి విషం తాగించి, అనంతరం తామూ పురుగుమందు సేవించారు. ఈ ఘటనలో చిన్నారి, మహిళ మృతి చెందగా, తీవ్ర అస్వస్థతకు గురైన మహేష్‌ను ఆదోని ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బళ్లారికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.