తొగలుగల్లు: వదిన హత్య చేసిన కేసులో మరిది అరెస్టు

8చూసినవారు
తొగలుగల్లు: వదిన హత్య చేసిన కేసులో మరిది అరెస్టు
ఆస్పరి మండలం తొగలుగల్లు గ్రామంలో గత నెల 21న వదిన గంగావతిని రోకలితో హత్య చేసిన కేసులో మరిది గొల్ల పెద్దయ్యను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 8న గొల్ల అహోబిలం హత్యలో భాగస్వామి అయిన భార్య గంగావతి, ఆమె ప్రియుడు చెన్న బసవ కలిసి హత్య చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోపంతో గొల్ల పెద్దయ్య గత నెల 21న రోకలితో గంగావతిని హత్య చేసి పరారయ్యాడు. దర్యాప్తులో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు హత్యకు ఉపయోగించిన రోకలి, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్