బిలేహళ్ లో విషాదం.. జ్వరంతో బాలుడు మృతి

2871చూసినవారు
బిలేహళ్ లో విషాదం.. జ్వరంతో బాలుడు మృతి
హాలహర్వి మండలంలోని బిలేహళ్ గ్రామంలో బుధవారం నాడు, శివకుమార్-గంగోత్రి దంపతుల నాలుగేళ్ల కుమారుడు బసవ జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలుడికి మొదట ఆలూరులో చికిత్స అందించినా, ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్