దేవనకొండకు చెందిన కటికే నరేశ్ (30) మంగళవారం ఉదయం హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందారు. మటన్ వ్యాపారం చేసుకునే నరేశ్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య, కూతురు ఉన్న నరేశ్ ఆకస్మిక మృతితో గ్రామస్థులు దిగ్భ్రాంతి చెందారు. ఈ విషాదంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.