నంచర్లలో యువకుడి మృతి.. ఎమ్మెల్యే సంతాపం

4చూసినవారు
నంచర్లలో యువకుడి మృతి.. ఎమ్మెల్యే సంతాపం
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నంచర్ల గ్రామానికి చెందిన భాస్కర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గ్రామానికి చేరుకుని భాస్కర్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్