
ఓర్వకల్లు ఇండస్ట్రీస్ భూమి పూజలో మంత్రి అచ్చెన్నాయుడు
మంగళవారం, ఓర్వకల్లు మండలంలో పలు పరిశ్రమల అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ పరిశ్రమల అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు కీలకమని నేతలు పేర్కొన్నారు.





































