బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 28 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) కింద రూ. 14,20,195 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీ, కుల, మత భేదాలు లేకుండా సహాయం అందిస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల వైద్య అవసరాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.